: మంత్రులను తొలగించాల్సిందే: వీహెచ్, శంకర్రావు
కళంకిత మంత్రులను తొలగించాల్సిందేనంటూ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మంత్రులకు అవినీతితో ప్రయోజనాలు సిద్దించలేదన్న ముఖ్యమంత్రి వాదనతో విభేధిస్తున్నారు ఆ పార్టీ సీనియర్లు. మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకే అవినీతికి సహకరించారని, అటువంటప్పుడు పదవులు అనుభవించడం ప్రయోజనం కిందకు రాదా? అని ప్రశ్నిస్తున్నారు. తాను జగన్ పై పిటీషన్ వేసినప్పుడు ఛార్జిషీటు కూడా వేయకుండా జగన్ ను జైళ్లో పెట్టారని, ఇప్పడు సీబీఐ కోర్టు చార్జిషీటు వేసినా మంత్రులను ఎందుకు జైళ్లో పెట్టడం లేదని మాజీ మంత్రి శంకర రావు ప్రశ్నించారు. చట్టాన్ని వివక్ష లేకుండా అందరికీ ఒకేలా వర్తింపజేయాలని ఆయనతో పాటూ వీహెచ్ కూడా డిమాండ్ చేసారు.