Godavari: లాంచీ ప్రమాద ఘటన.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్

  • ఈ ఘటనపై సీఎం జగన్ మరోమారు సమీక్ష
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం
  • బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు

గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందజేయాలని ఆదేశించారు.ఈ ఘటనలో బాధితులకు అండగా నిలవాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆయా బోట్లు ప్రయాణానికి అనుకూలమా? కాదా? అని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, బోట్ల లైసెన్స్ లు పరిశీలించాలని, నిపుణులతో మార్గదర్శకాలు తయారు చేయించి తనకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు.

కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయకచర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. విశాఖ, ఏలూరు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

More Telugu News