: ఆ జీవో రద్దు చెయ్యించరూ....: టీడీపీ నేతలు


తెలుగు దేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసేలా చొరవ చూపాలని ఆయనను కోరారు. గతంలో రక్షణ స్టీల్స్ కు కేటాయించిన గనులను రద్దు చేసిన తరువాత బయ్యారం గనులను విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది. దీంతో వివాదం రేగింది. తెలంగాణలోని పార్టీలన్నీ ఆ గనులను ఎవరికీ కేటాయించకూడదని, అక్కడే ఇనుము, ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ ఆందోళనలు, ధర్నాలకు దిగాయి. తాజాగా టీడీపీ తెలంగాణ ఫోరం నేతలు గవర్నర్ ను కలిసి జీవో రద్దు చేసేలా చెయ్యాలని కోరారు.

  • Loading...

More Telugu News