: అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జీ నియామకానికి కమిటీ
అనకాపల్లిలో పుంజుకునేందుకు టీడీపీ రంగం సిద్దం చేస్తోంది. తాజాగా దాడి రాజీనామా నేపధ్యంలో నిన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ భవన్ కు తరలివచ్చి, మేము పార్టీ మారేది లేదని పార్టీ అధినేతకు స్పష్టం చెయ్యడంతో అనకాపల్లి టీడీపీకి ఇన్ఛార్జీని నియమించేందుకు నిర్ణయించారు. అందుకు 10 మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేసారు. కమిటీ ఇన్ఛార్జీగా బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు. మరికొన్ని రోజుల్లో ఇన్ఛార్జీని నియమిస్తామని హామీ ఇచ్చారు.