Telugudesam: ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేస్తారా? రేపు మమ్మల్ని చంపమంటే చంపేస్తారా?: చంద్రబాబు
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
- పోలీసులకు ఎందుకు ఇంత భేషజాలు
- హోం మంత్రి, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి
తమ పార్టీ శ్రేణులపై వైసీపీ చేస్తున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రేపు ‘ఛలో ఆత్మకూరు’ తలపెట్టిన నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని అన్నారు. పోలీసులకు ఎందుకు ఇంత భేషజాలు? అని మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేస్తారా? రేపు మమ్మల్ని చంపమంటే చంపేస్తారా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. హోం మంత్రి, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.