Andhra Pradesh: వైసీపీ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: చంద్రబాబు డిమాండ్

  • రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేసిన చంద్రబాబు
  • ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి
  • బాధిత గ్రామాల్లో పోలీస్ పహారా పెంచాలి

వైసీపీ బాధితుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రేపు ‘ఛలో ఆత్మకూరు’ తలపెట్టిన నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.

* వైసీపీ కార్యకర్తల దాడుల్లో ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి
* పంట కోల్పోయిన బాధిత రైతులకు కౌలు చెల్లించాలి
* బాధిత గ్రామాల్లో పోలీస్ పహారా పెంచాలి
* సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ బృందాలతో భద్రత కల్పించాలి
* నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి
* ఎక్కడ స్వల్ప ఘర్షణ జరిగినా వెంటనే స్పందించాలి
* ఎఫ్ఐఆర్ నమోదు చేయని చోట వెంటనే నమోదు చేయాలి
* బాధితుల ఫిర్యాదులు స్వీకరించని పోలీసులపై చర్యలు చేపట్టాలి
* బాధితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.. భవిష్యత్ లో ఎలాంటి కేసులు
  పెట్టకూడదు
* టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి
* అక్రమంగా పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు ఉపసంహరించుకోవాలి

  • Loading...

More Telugu News