: క్రికెటర్లకు మగువలను ఎరవేసిన బుకీలు
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో మరికొన్ని విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుకీలు.. క్రికెటర్లను వలలో వేసుకునేందుకు వారి వద్దకు అందమైన అమ్మాయిలను కూడా పంపారని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీశాంత్, అజిత్ చండీలా కనీసం మూడుసార్లు అమ్మాయిల 'ఆతిథ్యం' రుచిచూశారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. క్రికెటర్లు, బుకీల మధ్య సాగిన టెలిఫోన్ సంభాషణలను విశ్లేషించగా ఈ సమాచారం బట్టబయలైంది. ఫిక్సింగ్ కు పాల్పడితే రూ. 60 లక్షలు ఇస్తామని బుకీలు చెప్పినట్టు తొలుత పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన సంగతి తెలిసిందే. తాజా సమాచారాన్ని బట్టి అమ్మాయిలను ఎరగావేసి క్రికెటర్లను ఫిక్సింగ్ ఊబిలో దించినట్టు స్పష్టమవుతోంది.