Andhra Pradesh: వైసీపీ వందరోజుల పాలనపై టీడీపీ నేతల వినూత్న నిరసన!
- గుంటూరులో వినూత్న రీతిలో పాదయాత్ర
- టీడీపీ నేతలు వెనక్కి నడుస్తూ నిరసన
- జగన్ పాలనలో ప్రజలకు మిగిలింది నిరాశే
ఏపీలో వందరోజుల పాలనపై టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరులోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వినూత్న రీతిలో పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నేతలు మద్దాలి గిరిధర్, జీవీ ఆంజనేయులు తదితరులు వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలిపారు. జగన్ వందరోజుల పాలనలో ప్రజలకు మిగిలింది నిరాశేనని విమర్శించారు. మంత్రుల మధ్య సయోధ్య లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు తొత్తులుగా మారారని టీడీపీ నేతలు ఆరోపించారు.