: చిరంజీవి సీఎం అయితే తప్పేంటి? : రామచంద్రయ్య


చిరంజీవి సీఎం అయితే తప్పేంటంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి స్వామి భక్తి చాటుకున్నారు దేవాదాయ శాఖా మంత్రి సి రామచంద్రయ్య. గతకొంత కాలంగా అవసరమున్నా, లేకున్నా చిరంజీవిని తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండేలా చూసుకుంటున్న రామచంద్రయ్య తాజాగా హైదరాబాద్ లో తనను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014లో చిరంజీవి ముఖ్యమంత్రి అయితే తప్పేంటని మీడియాను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో ఉంటారో ప్రజలే చూసుకుంటారన్నారు.

  • Loading...

More Telugu News