Chandrababu: గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా?: చంద్రబాబు
- జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు స్పందన
- వైసీపీ సర్కారు తీవ్రవాదం అని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారంటూ వెల్లడి
- '100 డేస్ తుగ్లక్ జగన్' అంటూ హ్యాష్ ట్యాగ్
వంద రోజుల జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పునఃసమీక్షల కారణంగా రూ.9 వేల కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి అని ఓ సీఈఓ పేర్కొన్నది నిజం కాదా అని నిలదీశారు. ఇది వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదం అని పారిశ్రామికవేత్తలు పేర్కొనడం వినబడలేదా? అంటూ వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. అంతేకాకుండా, '100 డేస్ తుగ్లక్ జగన్' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.