YSRCP: జగన్ అడిగితే సలహాలు ఇస్తా: జేసీ దివాకర్ రెడ్డి
- ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతుంది
- ఏ సర్కార్ కూడా వ్యాపారం చేయకూడదు
- రాజధాని అమరావతిలోనే ఉంటుంది
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతుందని, ఏ సర్కార్ కూడా వ్యాపారం చేయకూడదని సూచించారు. సీఎం జగన్ కనుక తనను అడిగితే సలహాలు ఇస్తానని అన్నారు. ఉద్యోగులను విలీనం చేయడం వ్యాపారమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి తరలిస్తారన్న వ్యాఖ్యలపై జేసీ స్పందిస్తూ, ‘రాజధాని ఇక్కడే ఉంటుంది, మా వాడు అంత తెలివి తక్కువ వాడు కాదు’ అని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తమ వాడేనని చెప్పిన జేసీ, జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందేనని అన్నారు.