chandrayaan2: చంద్రయాన్-1 రికార్డులు బద్దలుగొట్టిన చంద్రయాన్-2

  • చంద్రుడి మూడో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
  • ల్యాండర్ విడివడడానికి ముందు మరో మూడు విన్యాసాలు
  • సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ 

గతంలో పంపిన చంద్రయాన్-1 రికార్డులను తాజాగా పంపిన చంద్రయాన్-2 అధిగమించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 2 ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉంది. మూడో చంద్ర కక్ష్య విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు బుధవారమే పేర్కొన్న ఇస్రో .. అంతరిక్ష నౌకలో అన్నీ సవ్యంగా ఉన్నాయని గురువారం తెలిపింది.

 ప్రొపల్షన్ సిస్టంను ఉపయోగించి చంద్రయాన్ 2 అంతరిక్ష నౌకను విజయవంతంగా చంద్రుడి మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు తెలిపింది. అంతరిక్ష నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ వేరు పడడానికి ముందు మరో మూడు విన్యాసాలు నిర్వహించాల్సి ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. సెప్టెంబరు 7న విక్రమ్ జాబిల్లిపై ల్యాండ్ కానుంది.

More Telugu News