: హెలిస్కామ్ లో నా పాత్ర లేదు: త్యాగి
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో భారత వాయుసేన మాజీ అధిపతి పాత్ర ఉందంటున్నారు ఇటలీ దర్యాప్తు అధికారులు. హెలికాప్టర్ల సరఫరా ఒప్పందం కోసం ఇద్దరు అగస్టా మేనేజర్లు త్యాగి సోదరులకు సుమారుగా ఎనభై లక్షల రూపాయల వరకు చెల్లించారని అంటున్నారు. త్యాగి ముగ్గురు సోదరులు జులి, డోక్సా, సందీప్ త్యాగికి ఈ మేరకు లంచం చెల్లించినట్లు ఇటలీ పోలీసులు అరెస్ట్ వారెంట్లో పేర్కొన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
అగస్టా వెస్ట్ లాండ్ మాతృ సంస్థ ఫిన్ మెక్కానియా కంపెనీ అధిపతి ఓర్సిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్యాగి సోదరులతో సన్నిహిత సంబంధాలున్న అమెరికా వ్యక్తి రాల్ఫ్ హష్కేతో ఓర్సి ఈ వ్యవహారం నడిపించినట్లు ఇటలీ పోలీసుల కథనం.

అయితే, హెలికాప్టర్ల కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలను వాయుసేన మాజీ అధిపతి ఎస్.పీ. త్యాగి ఖండించారు. ఇవి తనను, తన కుటుంబ సభ్యులను షాక్ కు గురిచేశాయన్నారు. వీటిపై విచారణను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తన పదవీ కాలంలో నిబంధనలలో ఏ మార్పులూ చేయలేదని, 2003లోనే అవి జరిగాయని చెప్పారు. వాస్తవానికి త్యాగి 2007లో పదవీ విరమణ చేశారు. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం 2010లో జరగడం గమనార్హం.