Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు!

  • ఒడిశా తీరంలో అల్పపీడనం
  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • మరిన్ని రోజులు వర్షాలకు చాన్స్

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం, ఒడిశా తీరంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇదే సమయంలో 28వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే చాన్స్ ఉందని, దీంతో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఇదిలావుండగా, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ వర్షం పడింది. కర్నూలు, ప్రకాశం కడప, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి నాలుగు సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసినట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News