: శ్రీశాంత్ కు మద్దతు తెలపండి: సోదరుడు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు శ్రీశాంత్ కు ఏమీ తెలియదనీ, అతడొక అమాయకుడని సోదరుడు దిపు శాంతనా అన్నారు. అసలు తమ కుటుంబానికి స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పారు. కేరళ కోసం, యవ క్రీడాకారుల కోసం ఎంతగానో పాటుపడుతున్న శ్రీశాంత్ కు మద్దుతు అందించాలని కోరాడు. జిజు మంచి ప్లేయర్ అవడం కోసం శ్రీశాంత్ సహకారం అందించాడని, మరి స్పాట్ ఫిక్సింగ్ ఎలా జరిగిందో తెలియట్లేదనీ అన్నారు. పోలీసులు, కోర్టులతో ఎలా పోరాడాలో తెలియదనీ, తమ కుటుంబానికి మద్దతుగా అందరూ నిలబడాలని శాంతనా అభ్యర్థించారు.