: 'ఎలక్షన్... కలెక్షన్ల కేసీఆర్'


'ఎలక్షన్... కలెక్షన్' పద్దతిలో కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్సీ సంతోష్ ఆరోపించారు. కోటీశ్వరులకు టికెట్లు అమ్ముకుని తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే నిర్బంధ ఉచిత ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెడతానని చెబుతున్న కేసీఆర్, టీఆర్ఎస్ లోని కళాశాలల యజమానుల కాలేజీలలో ఎంతమందికి ఉచిత విద్య అందిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి సంపాదించుకునేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని సంతోష్ అన్నారు.

  • Loading...

More Telugu News