Vijayasai Reddy: మోదీ పేరును లాగిన విజయసాయిరెడ్డిపై కేంద్ర మంత్రి అసంతృప్తి

  • అన్ని విషయాలను మోదీ, అమిత్ షాలకు చెప్పే చేస్తున్నామన్న విజయసాయిరెడ్డి
  • విజయసాయి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన ఏపీ బీజేపీ నేతలు
  • మోదీ, అమిత్ షాలతో చర్చించిన తర్వాతే పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న షెకావత్

రీటెండరింగ్ కు సంబంధించి అన్ని విషయాలను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెప్పిన తర్వాతే చేస్తున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని విధంగా బీజేపీ నేతల నుంచి విజయసాయిరెడ్డి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు తప్పుబట్టారు. తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సీరియస్ అయ్యారు. రీటెండరింగ్ కు వెళ్లవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం హడావుడిగా రీటెండరింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు కూడా నిన్న ప్రాజెక్టు టెండర్ రద్దును నిలిపివేసింది.

మరోవైపు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఖండించిన విషయం కూడా షెకావత్ దృష్టికి వెళ్లింది. దీనిపై షెకావత్ కు సుజనా వివరణ ఇచ్చారు. మోదీ పేరును విజయసాయిరెడ్డి ప్రస్తావించిన తర్వాత తాను స్పందించానని తెలిపారు. అనంతరం షెకావత్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్ షాలతో చర్చిస్తానని చెప్పారు.

More Telugu News