: సీబీఐ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాలి: సురవరం
సీబీఐ డైరెక్టర్ పై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. రైల్వే మంత్రి బన్సల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. కేసు ప్రాధమిక దశలో ఉండగానే సీబీఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం కేసును నీరుగార్చడమేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన తొందరపాటు వ్యాఖ్యల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉన్నట్లు భావించాల్సి వస్తుందని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పదవుల నుంచి తప్పించాలని ఆయన కోరారు.