: జూన్ 3న నాగం బీజేపీలో చేరిక


తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కీలకనేతగా వెలుగువెలిగి, తెలంగాణ కోసమంటూ ఆ పార్టీని వీడి తెలంగాణ నగారా సమితి పార్టీని స్థాపించిన నాగం జనార్దన్ రెడ్డి చివరికి కమలం చెంతకు చేరుతున్నారు. జూన్ 3న హైదరాబాద్ లో జరిగే సభలో నాగం బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేత రామచంద్రరావు హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. తెలంగాణ, కోస్తాంధ్రలో కాంగ్రెస్ కు దీటుగా బీజేపీని పటిష్ఠం చేస్తామన్నారు. జూన్ చివరి వారంలో నరేంద్రమోడీ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News