Amit Shah: శ్రీనగర్ లాల్ చౌక్ లో భారత పతాకాన్ని ఎగురవేయనున్న అమిత్ షా

  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
  • అన్ని ఏర్పాట్లు చేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ ఆదేశం
  • లడఖ్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్న ధోనీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రేపు భారత్ ఘనంగా జరుపుకోనుంది. దేశ వ్యాప్తంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను చేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్ముకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కళాకారుల బృందాలతో ఇప్పటికే అక్కడ సందడి నెలకొంది. మరోవైపు, లడఖ్ లో టీమిండియా క్రికెటర్ ధోనీ జాతీయ జెండాను ఎగురవేయనున్నాడు.

  • Loading...

More Telugu News