Chandrababu: ఇలాంటి అరాచకాలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
- టీడీపీ నేతలు, కార్యకర్తలను వైసీపీ టార్గెట్ చేసింది
- 469 దాడులు జరిగాయి.. 8 మందిని హత్య చేశారు
- పోలీసులు కూడా నిస్సహాయులుగా మారిపోయారు
వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపై 469 దాడులు జరిగాయని... 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని అన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ నేతల అరాచకాలపై పోలీసులు కూడా నిస్సహాయులుగా మారిపోయారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకాలను ఎన్నడూ చూడలేదని అన్నారు.