: రాజస్థాన్ కి చెలగాటం... సన్ రైజర్స్ కి ప్రాణ సంకటం


ఐపీఎల్ లో నేడు కీలక సమరం జరుగనుంది. హైదరాబాద్ లో జరుగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ ఉత్కంఠ పోరు సన్ రైజర్స్ జట్టుకు జీవన్మరణ సమస్య కాగా, రాజస్థాన్ రాయల్స్ కు పరువు ప్రతిష్టల పోరాటం. ప్లేఆఫ్ లో స్థానం సంపాదించేందుకు సన్ రైజర్స్ బరిలో దిగనుండగా ఫిక్సింగ్ ఆరోపణలతో దిగజారిన రాజస్థాన్ రాయల్స్ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు మైదానంలో అడుగిడనుంది. ఐతే బౌలింగ్ లో పటిష్ఠంగా ఉన్న సన్ రైజర్స్ జట్టు బ్యాంటింగ్, బౌలింగ్ లో సమతూకంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ ని ఎలా ఎదుర్కొనబోతుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సన్ రైజర్స్ జట్టు స్వంత మైదానంలో ఆడుతుండడం లాభించనుంది. ఇప్పటి వరకూ ఈ గ్రౌండ్ లో జరిగిన 5 మ్యచ్ లలో హైదరాబాద్ నే విజయం వరించింది.

  • Loading...

More Telugu News