Pakistan: లడఖ్ సమీపంలోని ఎయిర్ బేస్ కు యుద్ధ విమానాలను తరలించిన పాకిస్థాన్... అప్రమత్తమైన భారత్

  • స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించిన పాక్
  • జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం
  • పాక్ ఎయిర్ ఫోర్స్ కదలికలను గమనిస్తున్న భారత నిఘా వ్యవస్థ

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం పాకిస్థాన్ కు మింగుడు పడటం లేదు. ఓపక్క జమ్మూకశ్మీర్ లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది. మరోవైపు, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది. ఈ క్రమంలో లడఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోంది.

More Telugu News