: భారతీయ విద్యార్థిని హతమార్చిన ఆస్ట్రేలియన్ కు 45ఏళ్ల జైలు
వయసు 19 ఏళ్లే. కానీ కిరాతకుడిగా మారాడు. సిడ్నీలోని క్రోడాన్ ఎడెల్విస్ వీధిలో భారతీయ విద్యార్థి 24 ఏళ్ల తోషా తక్కర్, డానియెల్ స్టాని రెగినాల్డ్ ఇరుగు పొరుగు అపార్ట్ మెంట్లో ఉండేవారు. ఇద్దరూ అకౌంటెన్సీలో సహ విద్యార్థులు. అయితే, తక్కర్ పై స్టాని చూపు పడింది. 2011 మార్చి 21న కాపు కాచి ఆమెపై అపార్ట్ మెంట్లో అత్యాచారం చేశాడు. వెంటనే కేబుల్ వైరు మెడకు చుట్టి తక్కర్ ను అంతం చేశాడు. సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టి పర్రమట్ట నదిలో విసిరేశాడు. ఈ కేసును విచారించిన న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు నిందితుడు స్టానికి 45 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ రోజు తీర్పు చెప్పింది. అందులో 30ఏళ్ల పాటు పెరోల్ కు అవకాశం లేని శిక్షను ఖరారు చేసింది.