: చండీలా గత ఐపిఎల్ లోనూ ఫిక్సయ్యాడా?


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన ముగ్గురు క్రికెటర్లలో ఒకరు అజిత్ చండీలా. ఇతడు గత ఐపిఎల్ లోనూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి ఉండవచ్చునని పోలీసుల అనుమానం. కాల్ రికార్డులలో ఉన్న సమాచారం ఆధారంగా వారీ అనుమానానికి వచ్చారు. వాస్తవానికి మొదటి మ్యాచులో ఒక ఓవర్లో అజిత్ సులభంగా బౌలింగ్ వేసి పరుగులు సమర్పించుకోవాలి. అలా బౌలింగ్ వేసే ముందు అజిత్ బుకీలకు సంకేతం ఇవ్వడం మర్చిపోయాడు. దీనిపై బుకీలకు, అజిత్ కు మధ్య వాదన జరిగింది. పోయినసారి మీకు సమస్య వచ్చిందా? అని అజిత్ బుకీలను ప్రశ్నించాడు. పోయినసారి అంటే గత ఐపిఎల్ అయి ఉంటుందని భావిస్తున్న ఢిల్లీ స్సెషల్ సెల్ పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News