Ajit: అజిత్ సినిమా టికెట్ దొరకలేదని ఆత్మహత్యాయత్నం!

  • పింక్ రీమేక్ గా 'నెర్కొండ పార్వై'
  • నిన్న విడుదలైన చిత్రం
  • తొలిరోజు టికెట్ దొరకలేదని ఆత్మహత్యాయత్నం

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'పింక్' చిత్రాన్ని నిర్మాత బోనీకపూర్ తమిళంలో 'నెర్కొండ పార్వై' పేరిట రీమేక్ చేయగా, అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైంది. ఇక తమిళనాడులో తమ అభిమాన హీరో అంటే, ఫ్యాన్స్ ఎంత ప్రాణం పెడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

చెన్నై, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్న నటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు.

More Telugu News