: సంజయ్ దత్ కు ఇంటి తిండే!
మూడున్నరేళ్ల శిక్ష అనుభవించేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఇంటి నుంచి వచ్చిన ఆహారమే పెట్టనున్నారు. ఇలా నెల రోజుల పాటు ఇంటి నుంచి వచ్చిన ఆహారం, మందులను తీసుకోవడానికి సంజయ్ దత్ కు న్యాయస్థానం అనుమతించింది. అంటే నెల పాటు మున్నాభాయ్ కు జైలు కూడు బాధలు తప్పినట్లే. ఇక తాత్కాలికంగా ఆర్థర్ రోడు జైలుకు పంపిన సంజయ్ దత్ ను మరో జైలుకు తరలించనున్నారు. పుణెలోని ఎరవాడ జైలుకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.