Jagan: ఇంతమంది పరీక్షలు రాస్తుండడం ఎప్పుడూ చూడలేదు: సీఎం జగన్
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన సీఎం
- గ్రామ సచివాలయ ఉద్యోగార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచన
- గ్రామ సచివాలయాన్ని బిడ్డలా చూసుకోవాలంటూ కలెక్టర్లకు స్పష్టీకరణ
గ్రామ సచివాలయాల అంశంపై సీఎం జగన్ స్పందించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డలా చూసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఇంతమంది పరీక్షలు రాస్తుండడం గతంలో ఎప్పుడూ చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు చూసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు ధ్యాస పెడితే అనేక సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సందర్భంగా జగన్ పైవ్యాఖ్యలు చేశారు.