: సెల్లు వాడకంతో బీపీ కూడా వస్తుంది...!


సెల్‌ఫోన్‌ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలట... ఎందుకంటే సెల్‌ ఉపయోగించేవారిలో బిపి పెరిగిపోయే ప్రమాదముందట. ఈ విషయాన్ని గురించి ఇటలీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటలీలోని గూగ్లీఎల్మోడ సల్‌సిటో ఆసుపత్రికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌కు కాల్‌ వచ్చినపుడు సదరు వ్యక్తి యొక్క రక్తపోటు స్థాయి 121/77 నుండి 129/82కి పెరిగిపోతోందట. రోజుకు కనీసం 30 కంటే ఎక్కువ ఫోన్‌కాల్స్‌ మాట్లాడే వారిలో ఈ పెరుగుదల స్థాయి మరింత ఎక్కువగా ఉందట.

ఇదలా ఉంటే మరోవైపు యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు యోగా వల్ల బిపిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు యోగా చేసేవారిపై దాదాపు 24 వారాల పాటు వీరు అధ్యయనం చేశారు. వీరి అధ్యయనంలో తేలిన విషయం ఏమంటే యోగా చేసేవారిలో రక్తపోటు 133/80 నుండి 130/77కు తగ్గుతోందట. బిపిని తగ్గించుకునే విషయంలో కేవలం ఆహార నియంత్రణ పాటించే వారిలో ఈ తగ్గుదల కేవలం ఒక పాయింట్‌ మాత్రమే ఉందట. కాబట్టి బిపి ఉండేవారు సెల్‌నుడి జర దూరంగా ఉంటూ... యోగా సాధన ద్వారా బిపిని తగ్గించుకుని మరింత ఆరోగ్యంగా మరికొంతకాలం పాటు ఆనందంగా ఉండవచ్చు...!

  • Loading...

More Telugu News