Chandrababu: వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలు పీకేయాలా?: చంద్రబాబు
- ఏపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు
- చిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారంటూ శాపనార్థాలు
- ప్రజలకు ఏంచేద్దామని ఉద్యోగాల హామీ ఇచ్చారంటూ నిలదీసిన మాజీ సీఎం
వైసీపీ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందంటూ మండిపడ్డారు. నిన్న ఆశాకార్యకర్తలను, ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రౌడీరాజ్యం తప్ప మరొకటి కాదని విమర్శించారు. అయినా, వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలు పీకేయాలా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కొత్తగా ఉద్యోగాల కల్పన చేసే సామర్థ్యం లేనప్పుడు ఉద్యోగాల హామీ ఇవ్వడం ఎందుకుని ప్రశ్నించారు.