: అల్జీమర్స్ మతిమరపును నయం చేయొచ్చు...!
అల్జీమర్స్ వ్యాధి మతిమరుపుకు సంబంధించింది. వయసు పెరిగిన తర్వాత కొద్దిమందిలో కనిపించే అరుదైన వ్యాధి. అయితే ఈ వ్యాధికి చికిత్స చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. మెదడులో ప్రధాన విషయ గ్రహణ భాగం దెబ్బతిన్నప్పుడు అది విషయ గ్రహణ సామర్ధ్యాన్ని కోల్పోతుంది. అయితే ఆ సామర్ధ్యాన్ని పునరుద్ధరించుకునేందుకు మెదడు సరికొత్త నాడీ వలయాలను ఏర్పరచుకుంటున్నట్టు వారి తాజా అధ్యయనంలో బయటపడిరది. అయితే ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరచటంలో పాల్గొనే భాగాలు, దెబ్బతిన్న భాగం నుండి దూరంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
మన మెదడులో విషయ గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి వంటి వాటికి కీలకమైన భాగం హిప్పోక్యాంపస్, ఇది దెబ్బతిన్నపుడు ఆ భాగం చేసే పనిని మెదడు ముందుభాగం తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల వల్ల అల్జీమర్స్, ఇంకా పక్షవాతం వంటి జబ్బుల వల్ల మెదడులో కీలకమైన భాగాలు దెబ్బతిన్న వారికి చికిత్స చేయడంలో మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.