: ఆ పాపం మనదే...!?


ఏ యేడుకాయేడు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూమి విపరీతంగా వేడెక్కిపోతోంది. దీనికి మూలకారణం ఎవరు...? ఇంకెవరు... మనమే...! ఇది ఉత్తినే అంటున్న మాట కాదు... 21 సంవత్సరాలుగా దీనిపై జరిపిన అధ్యయనం ఈ చేదు నిజాన్ని వెల్లడిస్తోంది. కీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 21 సంవత్సరాల కాలంలో పలువురు పరిశోధకులు నిర్వహించిన నాలుగువేల అధ్యయనాల ఫలితాలను, పరిశోధనా పత్రాలను విశ్లేషించి ఈ నిజాన్ని వెల్లడిస్తున్నారు. భూమి విపరీతంగా వేడెక్కిపోవడానికి కారణం మనుషులు చేస్తున్న తప్పిదాలేననే విషయంలో దాదాపు 97 శాతం మంది పరిశోధకులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. భూతాపం పెరిగిపోవడానికి కారణం మనుషులేననే విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా నిరూపించారు. ఇకనైనా మనం చేసిన తప్పును మనమే సరిదిద్దుకుందాం... భూమి వేడిని చల్లార్చడానికి ప్రయత్నాలు చేద్దామా...!

  • Loading...

More Telugu News