Kodela Sivaprasad: కోడెల కుమార్తెను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

- విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
- ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
- కేసు విచారణ వచ్చే నెల 13కి వాయిదా
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టు ఊరట కల్పించింది. ఆమెపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఆమెను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసు విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసింది. విజయలక్ష్మి తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నించడమే కాకుండా రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.