Cricket: టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండును వణికించిన ఐర్లాండ్ జట్టు!
- లండన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్
- తొలి ఇన్నింగ్స్ .. 23.4 ఓవర్లకు 85 పరుగులకే ఆలౌట్
- ఐర్లాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన
వరల్డ్ కప్ సాధించిన సంతోషంలో ఉన్న ఇంగ్లాండు జట్టును తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ టీమ్ వణికించింది. లండన్ లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 23.4 ఓవర్లకు 85 పరుగులకే ఇంగ్లాండు జట్టు కుప్పకూలింది. ఐర్లాండ్ బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండును తొలి ఇన్నింగ్స్ లో మట్టి కరిపించారు. టెస్టు చరిత్రలోనే ఇంగ్లాండుకు ఇది నాల్గవ అత్యల్ప స్కోరు కాగా, అతి తక్కువ ఓవర్లకే ఒక ఇన్నింగ్స్ లో ఆలౌట్ కావడం ఇది ఐదోసారి.
ఇంగ్లాండు జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే.. డెన్లీ (23), స్టోన్(19), సామ్ కరన్(18), బర్న్స్ (6), రాయ్ (5), రూట్ రెండు పరుగులు చేయగా, బెయిర్ స్టో, మొయిన్ అలీ, వోక్స్ లు డకౌట్ అయ్యారు. ఇక, ఐర్లాండ్ బౌలింగ్ గురించి చెప్పాలంటే.. ముర్తాగ్-5, అడెయిర్- 3, రాన్ కిన్ -2 వికెట్లు తీసుకున్నారు.