Andhra Pradesh: చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు బయటపెట్టినా ఆయన్ను ప్రజలు నమ్మరు!: విజయసాయిరెడ్డి

- శ్వేతపత్రాల పేరుతో బోగస్ పత్రాలు విడుదల చేశారు
- అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాల వాస్తవ పత్రాలను ఇప్పుడు బయటపెడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.