Andhra Pradesh: అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
- పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
- నామినేషన్, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు
- నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు
ఏపీ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ, నామినేషన్ పనుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన కీలక బిల్లులను ప్రవేశపెట్టింది.
అనంతరం, సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ బిల్లులు ప్రతిపాదించే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడం, అడ్డుకోవడం దారుణమని, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే ఈ బిల్లులను అడ్డుకోవడం కరెక్టు కాదని అన్నారు. ఇంతటి కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపాల్సింది పోయి అడ్డుకుంటారా? అని జగన్ మండిపడ్డారు. చారిత్రాత్మక బిల్లులకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులను దేవుడు శిక్షిస్తాడని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జగన్ వ్యాఖ్యానించారు.