: రాష్ట్రం అనాథ శిశువులా తయారైందంటున్న రాఘవులు
సీపీఎం నేత బీవీ రాఘవులు రాష్ట్ర స్థితిగతులపై వ్యాఖ్యానించారు. ఆయన నేడు విజయవాడ సుందరయ్య భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని చూస్తుంటే అనాథ శిశువులా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబినెట్ మంత్రులు ఏకంగా సీఎంనే విమర్శిస్తూ ఆయనపైనే ఫిర్యాదు చేసే స్థాయికి చేరుకోగా.. ముఠాలను అరికట్టలేని నిస్సహాయస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడని అన్నారు. ప్రజలకు మార్గదర్శకత్వం వహించాల్సిన ఇలాంటి మంత్రి వర్గం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని రాఘవులు వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఇలానే ఉండడంతోనే కాంగ్రెస్ సర్కారు మనుగడ సాగిస్తోందని ఆయన విమర్శించారు.