: బెట్టింగ్ కు చట్టబద్ధత కల్పించాలి: లలిత్ మోడీ
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై స్పందించారు. క్రికెట్లో బెట్టింగ్ కు చట్టబద్ధత కల్పిస్తే ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ భారీస్థాయిలో చోటు చేసుకుంటున్నా, బీసీసీఐ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మోడీ ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన బీసీసీఐ, ఐసీసీలు నిద్రపోతున్నట్టున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బెట్టింగ్ చట్టబద్ధం కావడంతో అక్కడ ఫిక్సింగ్ నేరాలు దాదాపు కనిపించవు.