: షాక్ తిన్న రాహుల్ ద్రావిడ్


రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. రాజస్థాన్ జట్టు రేపు హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు భాగ్యనగరానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ద్రావిడ్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంఘటన తనను కుదిపేసిందని చెప్పాడు. తామంతా ఓ కుటుంబంలా మెలిగామని, ఇప్పుడిలా జరగడం విచారకరమని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News