Nidhi Agarwal: పూరి ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం: నిధి అగర్వాల్

  • 'ఇస్మార్ట్ శంకర్'లో సైంటిస్ట్ గా కనిపిస్తాను 
  • చాలా ఎమోషనల్ గా నా పాత్ర వుంటుంది
  • మాస్ ఆడియన్స్ కి తన పాత్ర కనెక్ట్ అవుతుందన్న నిధి 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. రామ్ సరసన నాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ నటించారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో వుంది. ఆ కోరిక 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నెరవేరింది. నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమాలో నేను సైంటిస్ట్ 'సారా' పాత్రను పోషించాను. ఈ పాత్రలో నేను చాలా నాటీగా .. బోల్డ్ గా కనిపిస్తాను. స్మార్ట్ గానే కాదు చాలా ఎమోషనల్ గాను ఈ పాత్ర సాగుతుంది. నా పాత్రను పూరి చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది .. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News