: ఒక నేత పోతే 50 మంది నేతలను తయారుచేస్తాం: బాబు
అనకాపల్లి టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు నాయుడితో నేడు భేటీ అయ్యారు. సీనియర్ నేత దాడి వీరభద్రరావు పార్టీని వీడినా తామంతా తెలుగుదేశం పక్షాన ఉంటామని వారు బాబుతో చెప్పారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఒక నాయకుడు పోతే 50 మంది నేతలను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని వీడేవారంతా పదవులనాశిస్తున్న వారే అని బాబు ఆరోపించారు. ఇలాంటి వారు దూరమైతే వాటిల్లే నష్టం ఏమీ ఉండబోదని వ్యాఖ్యానించారు. నాయకులు పార్టీని వీడితే కార్యకర్తల్లో కసి పెరుగుతోందని, పార్టీకి కార్యకర్తలే బలమని ఆయన పేర్కొన్నారు.