కుర్రకారు మనసులను పట్టేసే 'గుణ 369' పాట

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా 'గుణ 369' సినిమా రూపొందుతోంది. కార్తికేయ సరసన 'అనఘ' నాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

" తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది " అంటూ ఈ పాట సాగుతోంది. నాయిక పట్ల కథానాయకుడు మనసు పారేసుకోగా, ఆమె పట్ల ఆయన మనసులో పొంగే భావాలకి అక్షర రూపంగా ఈ పాట ఆవిష్కృతమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. శుభం విశ్వనాథ్ సాహిత్యం .. హరిచరణ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. కుర్రకారు మనసులకు పట్టేసేలానే ఈ పాట వుంది. అనిల్ కడియాల - తిరుమల రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకోనున్నది.


More Telugu News