Andhra Pradesh: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జగన్ సర్కారు కీలక నిర్ణయం
- మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
- సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపనున్న ఉపసంఘం
- ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పలు వ్యవస్థాపరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంలో అన్ని కోణాల్లో ఈ కమిటీ పరిశీలన జరిపి నివేదిక రూపొందించనుంది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. కాగా, మంత్రివర్గ ఉపసంఘంలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల నాని ఉన్నారు.