India: మాంచెస్టర్ లో మళ్లీ మొదలైన ఆట... టీమిండియా టార్గెట్ 240 రన్స్

  • ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన భువీ
  • ధాటిగా ఆడబోయి విఫలమైన కివీస్
  • మాంచెస్టర్ లో శాంతించిన వరుణుడు

అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ మళ్లీ మొదలైంది. మాంచెస్టర్ లో వర్షం వల్ల మంగళవారం అంతరాయం ఏర్పడగా, ఇవాళ రిజర్వ్ డేలో ఆటను కొనసాగించారు. 46.1 ఓవర్ల నుంచి ఆటను పునఃప్రారంభించిన కివీస్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా భారత్ వెంటవెంటనే వికెట్లు తీసి కివీస్ ను కట్టడిచేసింది. ఓవర్లన్నీ ఆడిన కివీస్ చివరికి 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. రాస్ టేలర్ తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి 74 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో టామ్ లాథమ్ ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో కివీస్ ఏడో వికెట్ చేజార్చుకుంది. అదే ఓవర్లో చివరి బంతికి భువీ మరో వికెట్ తీయడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కివీస్ చివరి వరుస బ్యాట్స్ మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.

More Telugu News