: న్యాయమూర్తి ఎదుటకు ఫిక్సింగ్ త్రయం
ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లను ఈ సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ ను ముంబయిలోని కార్టర్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకోగా, చండీలాను ముంబయి ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వద్ద, చవాన్ ను ముంబయి ట్రైడెంట్ హోటల్ వద్ద అరెస్టు చేశారు. అనంతరం వీరిని ఢిల్లీ తరలించారు. పోలీసుల వద్ద.. ఆటగాళ్ళతో బుకీలు ఫోన్ లో ఏం మాట్లాడారన్న సమాచారంతో పాటు పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్స్ డేటా యావత్తూ ఉన్నట్టు తెలుస్తోంది.