: రూ.ఇరవై కోట్లు పలికిన 'స్టార్ ఆఫ్ కాశ్మీర్'
భారత్ లో లభ్యమైన ఓ నీలం రంగు రత్నానికి వేలంలో కోట్ల రూపాయల ధర పలికింది. 'స్టార్ ఆఫ్ కాశ్మీర్' గా వినుతికెక్కిన ఈ రత్నం తాజాగా క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైంది. ఈ 19.88 క్యారట్ల రత్నం క్యారట్ కు రూ. కోటి చొప్పున ధర పలికింది. కాగా, ఈ రత్నం కాశ్మీర్ రత్నాల పరంపరలో అరుదైనదని క్రిస్టీ వేలం సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ వేలం నేడు జెనీవాలో జరిగింది. కొద్దివారాల క్రితం ఇండియన్ పింక్ డైమండ్ 'ప్రిన్సీ' క్రిస్టీ నిర్వహించిన వేలంలో రూ.200 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.