Jagan: జగన్ క్యాంపు కార్యాలయం ఎదుట బీమా కాల్ సెంటర్ ఉద్యోగుల ఆందోళన

  • కనీస వేతనాలు ఇవ్వలేదంటూ నిరసన
  • ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్
  • పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నపం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం ఎదుట బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు వెయ్యికి పైగా ఉద్యోగులు తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు వచ్చారు. 15 ఏళ్లకు పైగా పని చేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని... తమకు ఉద్యోగ భద్రతను కలిగించాలని, జీతాలను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అయితే, జగన్ ను కలిసేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో వారంతా అక్కడే బైఠాయించి, ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. మరోవైపు, కళ్యాణమిత్రలను తొలగిస్తారనే ప్రచారం నేపథ్యంలో, వారు కూడా గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

More Telugu News