Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ!

  • నియోజకవర్గం అభివృద్ధిపై చర్చ
  • రైల్వేలైను కోసం రూ.300 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

వైసీపీ నేత, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. తన నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా విజయవాడ-మచిలీపట్నం రైల్వేలైను విద్యుద్దీకరణ పనుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.300 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీచేసిన వల్లభనేని బాలశౌరి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై 60,238 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

More Telugu News