: అవినీతి మంత్రులను సోనియా ఉపేక్షించరు: ఎమ్మెస్సార్


అవినీతి మంత్రుల తొలగింపు విషయంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంథీ సుముఖంగా ఉన్నారని ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణరావు అన్నారు. వరంగల్లులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెస్సార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు మంత్రులను సోనియా తొలగించారని గుర్తు చేసారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వల్ల పార్టీకి ఏదైనా నష్టం ఉందని భావిస్తే సోనియా ఉపేక్షించరని ఎమ్మెస్సార్ తెలిపారు.

  • Loading...

More Telugu News