Andhra Pradesh: రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: టీడీపీ అధినేత చంద్రబాబు
- ‘రుణమాఫీ’ ప్రస్తావనే లేదు
- అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు
- సాగు చేసేందుకు రైతుల వద్ద పెట్టుబడిలేని పరిస్థితి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ‘రుణమాఫీ’ ప్రస్తావనే లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సాగు చేసేందుకు పెట్టుబడిలేని పరిస్థితులు తలెత్తాయని, ఏదో విధంగా పెట్టుబడికి సిద్ధమైతే విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొందని, ఇందుకు కారణం ప్రభుత్వ ప్రణాళికా లోపమేనని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు.